calender_icon.png 12 March, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ క్యాంపస్ సందర్శించిన వైస్ ఛాన్స్ లర్ యాదగిరిరావు

11-03-2025 10:42:53 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణాన్ని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మంగళవారం సందర్శించారు. గతంలో దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపల్ యూనివర్సిటీ వసతి గృహాలలో ఉన్న సమస్యలను వీసీ దృష్టికి తీసుకువెళ్లగా నేడు వసతి గృహాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.

చిన్న చిన్న సమస్యలైన డ్రైనేజీ లాంటి సమస్యలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం వచ్చినందున విద్యార్థులకు నీటి సౌకర్యాన్ని సక్రమంగా అందించాలని ఆదేశించారు. ప్రాంగణంలోని బాలికల, బాలుర హాస్టళ్ల వంట శాలలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాన్ని అలాగే పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు సౌకర్యాలు ఉపయోగించుకుని మంచి చదువు చదవాలని గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు. విసీ వెంట యూనివర్సిటీ ఏఈ వినోద్, దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, బాలుర బాలికల హాస్టల్ ల వార్డెన్లు డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ నాగరాజు, డాక్టర్ నారాయణ, డాక్టర్ రమాదేవి, విద్యార్థులు ఉన్నారు.