calender_icon.png 24 October, 2024 | 2:16 AM

నా శక్తికి మించి సేవ చేశా

18-09-2024 01:48:46 PM

-మూడేళ్ల పాటు 100 మందికి పింఛన్లు 

-పేదలకు ఉచితంగా సిలిండర్లు పంపిణీ 

-ఇచ్చిన గుర్తింపు రెట్టింపు అయ్యేలా పనిచేస్తా 

మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి):  రైతులు పడుతున్న కష్టంను తమ శ్రమగా భావించి ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం ఉన్న సందర్భంగా వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ విజయక్రాంతితో మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అనే పదం కంటే గంజి అనే పదం నేను నా చిన్నప్పటి నుంచి అత్యధికంగా విన్నాను. ఎందుకంటే మా అమ్మ కూడా గంజిలో చాటకూలి పని చేసింది. అప్పటినుంచి ఎంతో శ్రమించి తాము మరొకరికి సహాయం చేసే స్థాయికి చేరుకున్నాం. సాధ్యమైనంత వరకు చేతన అయిన సహాయం చేస్తూ వస్తున్నాం. ప్రజలకు మంచి చేయాలని తపన నాకు ఏ పదవి లేనప్పుడే ఉంది, అడిగిన వారికి సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గుర్తించి మొదటిసారి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యత ను అప్పగించింది. ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా పనిచేసే ఇటు పార్టీకి అటు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం. అందరి కడుపు నింపే రైతన్న కడుపు మాడకుండా చూసే బాధ్యత తో పనిచేసి రైతుల మనలను పొందాలని మా సంకల్పం. 

శక్తికి మించి సేవ చేశా...

నాకు కొంతవరకే సహాయం చేయాలని స్తోమత ఉన్న నా శక్తికి మించి పేదలకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటూ వస్తున్నాను. గతంలో ప్రభుత్వం పెన్షన్లను రూ. 200 ఇచ్చిన విషయం అందరికీ తెలుసు, తమ శక్తి మేరకు 100 మందికి ఒక్కొక్కరికి 200 చొప్పున మూడేళ్ల పాటు పెన్షన్లు ప్రభుత్వం మాదిరిగా ప్రతినెల ఇస్తూ వచ్చాను. దాదాపు 50 మంది వరకు నిరుపేదలకు సిలిండర్ లో ఉచితంగా అందజేశాను. ఇలా తమకు చేతనైనంత సహాయం చేస్తూ  వస్తున్నాను. ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తూ ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంతున్నాను. గతంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండేవి, సొంత డబ్బులు వెచ్చించి పలు కాలనీలలో బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ప్రజాసేవలో నేనున్నానంటూ పెద్ద విజయ్ కుమార్ ముందు నుంచి ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. 

రైతుల శ్రమ వృధా పోనివం....

రైతులు నెలల తరబడి శ్రమించి పంట పండించి ధాన్యం తీసుకువచ్చిన వారి శ్రమ ఎట్టి పరిస్థితుల్లో వృధా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెట్టిండ్రు. వారి శ్రమకు ఖచ్చితమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతాం. రైతులు రాత్రికి ఉండేందుకు కనీసం నివాసం కు కూడా లేదు, రాత్రి సమయంలో తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు పలు సమస్యలు ఉన్నాయి. నెలకొన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మా చైర్మన్ తో కులంకశంగా చర్చించుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించడమే మా ముందున్న ప్రధాన కర్తవ్యం.