calender_icon.png 25 March, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీహెచ్‌పీ నేత శశిధర్ ఇంటిపై దాడి

23-03-2025 12:00:00 AM

  1. దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం పోలీసులు
  2. గతంలో పలుసార్లు శశిధర్  ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఆగంతకులు

ఎల్బీనగర్, మార్చి 22 : పీహెచ్ పీ నాయకుడు రావినూతల శశిధర్ ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  దాడిపై వనస్థలిపురం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తన ఇంటి వద్ద గుర్తు తెలియని నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించి, శుక్రవారం రాత్రి ఇంటిపై దాడి చేశారన్నారు.

నెల రోజులుగా తనకు బెదిరిస్తూ ఫోన్లు చేశారని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని భద్రత కల్పించాలన్నారు. గతంలో కూడా తన ఇంటిపై దాడి చేసిన ఘటనలపై రెండు కేసులు ఉన్నట్లు గుర్తు చేశారు. కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు.