హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): అనారోగ్యంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తిని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడి నారాయణమూర్తి ఆరోగ్యం, అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. వీహెచ్ వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్, పీసీసీ కార్యదర్శి పలుగుల శ్రీనివాస్, నిమ్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజ్‌కుమార్ తదితరులున్నారు.