calender_icon.png 29 January, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వీహెచ్ భూమిపూజ

27-01-2025 12:44:02 AM

ఏప్రిల్ 14న సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ 

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆదివారం అంబర్‌పేటలోని శ్రీరమణ చౌరస్తా వద్ద భూమి పూజ చేశారు. ఏప్రిల్ 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతు ల మీదుగా ఆవిష్కరించనున్నట్లు వీహెచ్ తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.