24-02-2025 12:08:43 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : అనారోగ్యంతో ప్రభుత్వ పశు వైద్యాధికారి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన పుట్ట రాం రెడ్డి (55) సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పశువైద్యాధి కారిగా విధులు నిర్వహిస్తు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు, స్నేహితులు తెలిపారు. రాం రెడ్డి మృతి పై తోటీ ఉద్యోగులు , స్నేహితులు,గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.