calender_icon.png 4 March, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశు వైద్య శిబిరం పాలు ఎక్కువ ఉత్పత్తి చేసిన రైతులకు బహుమతులు

04-03-2025 12:36:27 AM

పిట్లం, మార్చి 3 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో సోమవారం నిర్వహించిన పశు వైద్య శిబిరం, ఎక్కువగా పాల ఉత్పత్తి చేసిన రైతులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో పశువులకు వై ద్యసేవలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. మండల పశు వైద్యాధికారి సంతోష్ ఈ సందర్భంగా పశువులకు వైద్యం చేసి, రైతులకు అవసరమైన సలహాలు అం దించారు.

ఈ కార్యక్రమంలో  ఎక్కువ పాలు ఇచ్చే గేదెల యజమానులకు ప్రత్యేక బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వుజర్ తిరుపతి, గోపాలమిత్ర, సంగమేశ్వర్, రైతులు పాల్గొన్నారు.