04-04-2025 08:51:40 AM
ముంబై: దేశభక్తి నేపథ్య చిత్రాలకు ప్రసిద్ధి చెందిన 'భరత్ కుమార్'(Bharat Kumar) అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ భారతీయ నటుడు, చిత్రనిర్మాత మనోజ్ కుమార్(Actor Manoj Kumar Passes Away) 87 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి(Kokilaben Dhirubhai Ambani Hospital)లో తుది శ్వాస విడిచారు. 1937 జులై 24న జన్మించిన ఆయన గుండె(Heart problem) సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. నటుడుగానే కాకుండా గీత రచయిత, నిర్మాతగా ఆయన పనిచేశారు. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంతో పాటు పలు చిత్రాల్లో మనోజ్ కుమార్ నటించారు.
హిందీ సినిమాలో ఒక పురాణ పేరున్న ఆయన షహీద్ (1965), ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970) వంటి దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్‌కు ఆయన చేసిన కృషికి 1992లో పద్మశ్రీని(Padma Shri award) అందుకున్నారు. తరువాత 2015లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Dadasaheb Phalke Award)తో సత్కరించబడ్డారు. హరియాలి ఔర్ రాస్తా, వో కౌన్ థి, హిమాలయ కీ గాడ్ మే, దో బదన్, పత్తర్ కే సనమ్, నీల్ కమల్, క్రాంతి వంటి క్లాసిక్‌లతో కూడా మనోజ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. జాతీయ చలన చిత్ర పురస్కారం, 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.