calender_icon.png 16 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరా పేరుతో నిలువు దోపిడీ!

13-01-2025 01:24:40 AM

  • ఈత వనంతో కల్తీ వ్యాపారం

నిబంధనలు పాటించని గీత కార్మికులు

మూడు చెట్లు ఆరు లొట్లుగా ఫుల్ బిజినెస్ 

ప్రతిరోజూ రూ.ఐదువేల నుంచి పదివేల ఆదాయం 

నిద్రావస్థలో ఎక్సైజ్ శాఖ 

కల్వకుర్తి, జనవరి 12: పండుగ వచ్చిందం టే సుక్క ముక్క ఉం డాల్సిందే... ఒకప్పుడు శ్రేష్ఠమైన కల్లుకు కేరాఫ్ అడ్రస్ పేరుగాంచిన తర్నికల్ గ్రామంలో నేడు అదే నీరా పేరుతో కల్తీ కల్లు, మత్తు కల్లు అంటగట్టి కల్లు ప్రియు లను నిలువునా దోచేస్తున్నారు. ఒక చెట్టుకు కేవలం ఒక్కసారి మాత్రమే విడుదలయ్యే నీ రా పేరుతో నాణ్యతలేని నీరు చక్రిన్, ఇతర మత్తుమందు కలిపిన కత్రిమ కల్లు అంటగ డుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కులవత్తి పైనే జీవనాధారంగా ఉన్న గౌడన్న లకు గత ప్రభుత్వం ఈత తాటి వనాలను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో గౌడన్నలు ఈత వనాలను ఏర్పాటు చేసుకోగా వాటి నుంచి ఇప్పుడి ప్పుడే నీరా వెలువడుతోంది. కిడ్నీ సంబంధి త వ్యాధులను నయం చేయగలిగే నీరా కోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా గ్రా మాల నుంచి పెద్ద ఎత్తున తర్నికల్ గ్రామా నికి తరలి వస్తుంటారు.

క్రమంగా కల్లు ప్రి యులు సంఖ్య పెరుగుతుండడంతో తగినం త నీరా విడుదల కాక గౌడన్నలు వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తూ నీరా పేరుతో వారిని మోసగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కత్రిమంగా తయారు చేసే కల్తీ కల్లునే అంటగడుతు న్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈత, తాటి చెట్ల నుండి రోజులో కేవలం ఒక్క సారి మాత్రమే విడుదలయ్యే నీరాతో పాటే అదే లొట్టిలో మడ్డి కల్లు ఇతర మత్తు పదార్థాలు చక్రిన్ వంటి వాటిని వాడుతూ శ్రేష్టమైన నీరా అంటూ సామాన్యలను బురిడీ కొట్టిస్తు న్నారని మండిపడు తున్నారు.

ల్వకుర్తి నుంచి జిల్లాకు వెళ్లే మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఈత చెట్లు కనిపించడంతో శ్రేష్టమైన నీరా అయి ఉంటుందని ప్రజలు గీత కార్మికులను నమ్మి చక్రిన్,  మత్తు పదార్థాలని కలిపిన కల్లు, నీరాను తాగి, గొంతు నొప్పితో అనేక అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు. సంబంధిత అబ్కారీ శాఖాధికారులు మాత్రం ఏ ఒక్క రోజు కూడా తనిఖీలు చేయకపోవడం పలు అను మానాలకు తావిస్తోంది.

ఈ తవనం పేరుతో జరుగు తున్న ఈ కల్తీ వ్యాపా రానికి ఎక్సైజ్ శాఖ అధికా రులు పరోక్షంగా సహకరిస్తు న్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా నిద్రావస్త నుండి మేలుకొని ఈత వనం చాటున జరుగుతున్న కల్తీ వ్యాపారాన్ని సరైన గాడిలో పెట్టి శ్రేష్టమైన కల్లును ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కల్లు ప్రియలు కోరుతున్నారు.