26-04-2025 12:06:48 AM
టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశం
మెదక్, ఏప్రిల్ 25(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన వెరిఫికేషన్ అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ పలు సూచనలు చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హౌసింగ్ పీడీ మాణిక్యం, డిపిఓ యాదయ్యతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ కార్యక్రమంపై సంబంధిత ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన నివేదికల ననుసరించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయుట, పరిశీలించుటకు ఎంపీడీవోలు ఏఈ, ఏ.ఓ, ఎంపీవోలను టీం గా ఏర్పాటు చేసిన బృందానికి పర్యవేక్షణ అధికారిగా మండలాల ప్రత్యేక అధికారులుగా ఉంటారని, జిల్లాలోని 21 మండలాలతో పాటు మున్సిపాలిటీలను కలిపి మొత్తం 67 మంది వెరిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ ఏప్రిల్ 30 వరకు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి వడగాలుల దృష్ట్యా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉపాధి పనులు మరే ఇతర పనులకు వెళ్ళే అవకాశం ఉన్నందున వెరిఫికేషన్ టీం లబ్ధిదారులు ఇంటివద్ద ఉన్న సమయంలో వెళ్లాలని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎంపీడీవోలుపాల్గొన్నారు.