calender_icon.png 20 April, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 నుంచి గ్రూప్- 1 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

10-04-2025 02:25:36 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి):  గ్రూప్ 1 ఎంపికైన అభ్య ర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నే పథ్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సం బంధించిన షెడ్యూల్‌ను విడుదల చే సింది. ఏప్రిల్ 16, 17, 19, 21వ తేదీ ల్లో సర్టిఫికెట్ల పరీశీలన జరగనుందని.. ఈ నెల 22ను రిజర్వ్‌డేగా ప్రకటించినట్టు తెలిపింది. నాంపల్లిలోని సుర వరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీలో కేటాయించిన సమయాల్లో అభ్యర్థు లు హాజరుకావాలని సూచించింది. స ర్టిఫికెట్ వెరిఫి కేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ను కమిషన్ వెబ్‌సైట్ లో  పొందుపర్చినట్లు తెలిపింది. గతేడాది ఫిబ్రవరి 19న 563 గ్రూప్1 పో స్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విష యం తెలిసిందే. వెరిఫికేషన్‌కు హాజర య్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు రెండు సెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్టాట్ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించింది.