- సంధ్య థియేటర్ కేసు..
- అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయి ల్ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీ ర్పును జనవరి 3కి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన బీఎన్‌ఎస్ సెక్షన్ 105 ఆయనకు వర్తించదని చెప్పారు.
ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయి ల్ ఇచ్చిందని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయి తే, అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ‘రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం. ఆయన రావడంతోనే తొక్కిసలాట జరిగింది.
ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారు. పో లీసుల విచారణకు సహకరించరు. అల్లు అ ర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి’ అని కో ర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదన లు విన్న న్యాయస్థానం.. తీర్పును జనవరి మూ డో తేదీకి వాయిదా వేసింది. కాగా, సం ధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జు న్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.