ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితుడు..
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్‌రావు దాఖలు చేసిన అతవ్యసర మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు ఇవ్వనున్నది. తన సమీప బంధువు పెండ్లికి హాజరు కావాల్సి ఉందని, ఈ కారణంతో తనకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు మధ్యంతర బెయిల్ మం జూరు చేయాలని రాధాకిషన్‌రావు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.సుజన బుధవారం విచారణ ముగించారు. గురువారం ఉత్తర్వులు వెలువరిస్తా మని ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
ఇతర నిందితులు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం మేరకు తనను అరెస్టు చేశారని, తనపై అభియోగాలకు ఆధారాలు లేవన్నారు. సీనియర్ సిటి జన్ అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గతేడాది మార్చి నుంచి జైలులో ఉన్నానని, తను రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
‘రాధాకిషన్‌రావుకు బెయిల్ ఇవ్వొద్దు’
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావుకు బెయిలు మంజూరు చేయ వద్దని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో వాదించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు కోర్టుకు తెలిపారు. ఈ వివరాలను సీల్ కవర్‌లో అందజేస్తున్నామని, వాటిని పరిశీలించాలని కోరారు. పలువురు జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వివరించారు.
సుప్రీం కోర్టు ఇదే కేసులో మరో నిం దితుడు తిరుపతన్నకు బెయిల్ మం జూరు చేసే సమయానికి అదనపు సమాచారం పోలీసులకు అందలేదని హైకోర్టు ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా తన సోదరి కుమార్తె పెళ్లి ఉన్నందున ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని రాధాకిషన్‌రావు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ సుజన తెలిపారు.
భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు, మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు చెప్పనున్నది. గతేడాది మార్చిలో అరెస్టున భుజంగరావుకు ఆగస్టులో వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం నాం పల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిం ది. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను కోర్టులు పొడిగిస్తూ వస్తున్నాయి. తన కు రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సుజన గురువారం తీర్పు వెలువరించనున్నారు.