06-03-2025 12:16:48 AM
నల్లగొండ, మార్చి 10 (విజయక్రాంతి): సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు విచారణ ముగిసింది. ఈ నెల 10న నల్లగొండ జిల్లా స్పెషల్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. అమృతను ప్రేమ వివాహం చేసుకున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ 2018 సెప్టెంబర్ 14 న హత్యకు గురయ్యాడు.
కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కక్షతో సుఫారీ గ్యాం సాయంతో ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించినట్లు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేర కు మారుతీరావుతో సహా ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1 నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.