హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను బుధవారం సినీ జ్యోతిష్కుడు వేణుస్వామి పరా మర్శించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానన్నారు. బాలుడి కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తానన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు.
జానీమాస్టర్ సైతం..
శ్రీతేజ్‌ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం పరామర్శించారు. బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డ్యాన్సర్స్ యూని యన్ తరఫున సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జానీమాస్టర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ ఆరో గ్యం మెరుగుపడుతుందని, బాలుడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
‘మీరు అల్లు అర్జున్‌ను కలిశారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఆయన ‘లేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నా’ అని సమాధానమిచ్చారు.