హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ మహిళా కమిషన్‌కు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. నటీనటుల వ్యక్తి గత జీవితాలపై గతంలో వేణుస్వా మి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై మండిపడుతూ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. నోటీసులను సవా లు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతో వేణుస్వామి మంగళవారం మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి క్షమాణలు కోరారు.