calender_icon.png 2 February, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ప్రారంభమైన వేణుగోపాలస్వామి ఉత్సవాలు

02-02-2025 12:00:00 AM

కడ్తాల్, ఫిబ్రవరి 1 ( విజయ క్రాంతి ) :  కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త వింజమూరి రామాను జాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో తొలి రోజు ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మాజీ సర్పంచి సులోచన సాయిలు, మాజీ ఎంపిటిసి మంజుల చంద్రమౌళి, తదితరులు స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలనీ కోరారు.