- పామాయిల్ సాగు
- మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు!
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20 (విజయక్రాంతి): పాల్వంచలోని అసైన్ట్, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలిసినా, పామాయిల్ సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పాల్వంచ పట్టణ పరిధిలో ని వెంగళరావు కాలనీ, ప్రశాంతి కాలనీల మధ్య సర్వే నం 727 లో కాంపెల్లి జనార్ధన్‌కు 4 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు ఎకరా ప్రభుత్వ భూమి ఉన్నది.
జనార్ధన్ తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇతరులకు అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తున్నది. ఆ భూమిని కొన్నవారు అదే సర్వే నంబరులోని ఎకరా ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి, రియల్ దందా కొనసాగిస్తున్నారు. కొందరు పామాయిల్ కూడా సాగు చేస్తున్నారు. సుమారు 75 ప్లాట్లు చేసి సర్వే నంబర్ 727/24 తో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.
ఈ అక్రమాలపై కలెక్టర్లకు, సీసీఎల్‌ఏకు స్థానికంగా ఉన్న హను మాన్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరుద్ర సత్యనారాయణ ఫిర్యాదు చేసి నా ఫలితం లేకుండా పోయింది. ఈ తంతు 2008 నుంచి కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకవడంలేదు. అక్రమ వెంచర్లపై 2022లో అప్పటి తహసీల్దార్ స్వామికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
2023లో తహసీల్దార్ రంగాప్రసాద్‌కు ఫి ర్యాదు చేయగా.. అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించి, 450 అడుగుల భూమిని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. మిగిలిన భూమి ఖాలీ స్థలంగా నమోదు చేసి వదిలేశారు.
ఆ భూమిలో అక్ర మ నిర్మాణాలు జరుగుతున్నాయి. 2023లో అప్పటి కలెక్టర్ ప్రియాంక అలా, ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ 5 ఎకరాల భూమిని పరిరక్షించాలని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు.
పాల్వంచలోడీజీపీఎస్ సర్వే షురూ
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న పాల్వంచ పట్టణంలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది. ప్రత్యేక సర్వే బృందాన్ని రంగంలో దింపి 444, 817, 727, 999 సర్వే నంబర్లలోని మొత్తం 8,818 ఎకరాల ప్రభుత్వ భూముల్లో డీజీపీఎస్ (డిఫరెన్సిల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా 20 రోజుల్లో సర్వే చే నిర్ణయించారు.
రెవెన్యూ శాఖ ప్రయోగాత్మకంగా పాల్వంచ పట్టణాన్ని ఎం చేసింది. దీంతో కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన 10మంది సర్వేయర్లతో ఈ ప్రత్యేక బృందం సర్వే చేయనుంది. సర్వే ఆధారంగా వారు ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే నివేదిక సమర్పించనున్నారు.
మంత్రి పొంగులేటి చొరవ
ఈ సర్వే నంబర్లలోని భూముల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ భూములు వివాదాలకు నిలయంగా మారాయి. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డీజీపీఎస్ సర్వేపై అధికారులతో సమా చేసి దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృం సర్వే చేపట్టింది. ప్రస్తుతం 444 సర్వే నెంబర్‌లో డీజీపీఎస్ సర్వే కొనసాగుతోంది. డీజీపీఎస్ సర్వే కార్యరూపం దాల్చడంతో ఆక్రణదారుల వెన్నులో వణుకు మొదలైంది.