calender_icon.png 26 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా వెన్నెల బాధ్యతలు

26-11-2024 12:52:04 AM

అభినందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ 

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సమక్షంలో మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా  మంత్రి జూపల్లి మాట్లాడుతూ వెన్నెల సారథ్యంలోని  తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ర్ట సాధనలో గద్దర్ కీలక పాత్రను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు.

వెన్నెల సారథ్యంలోని  తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం అవుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆట, పాటకు ఆదరణ దక్కలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సినీ నటుడు ఆర్, నారాయణ మూర్తి, విమల గద్దర్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తదితరులు హాజరయ్యారు.