సంక్రాంతి సంబరాల్లో హరిదాసుల పాటకు పోటీనిచ్చేందుకు వెంకీ మామ మరోమారు గొంతు సవరించుకున్నాడు. గతంలో ‘గురు’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ‘జింగిడి జింగిడి’ అంటూ పాడిన పాట అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్‌గా అలరించబోతున్నాడు వెంకటేశ్.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్‌కు తన వాయిస్‌ను అందిస్తున్నారాయన. దర్శకుడు తొలుత ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్‌తో పాడించాలనుకున్నారు. అయితే తానే పాడతానని వెంకటేశ్ కోరడం, డైరెక్టర్ అంగీకరించడంతో వెంకీ గాత్రాన్ని వినే భాగ్యం అభిమానులకు కలుగుతోంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.