మంచిర్యాల,ఆగస్టు 25 (విజయక్రాంతి): మంచిర్యాల ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ ఆదివారం అధికారికంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాసభ ఉపాధ్యక్షుడు సల్మాను కాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి ముక్త శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.