calender_icon.png 24 November, 2024 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరనున్న కలియుగ దైవం

21-11-2024 09:43:10 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అట్టహాసంగా భూమిపూజ జరిగి... నిర్మాణం వైపు అడుగులు పడిన సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దీంతో మళ్లీ భుజాన వేసుకున్న గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ, 10 ఎకరాల భూమి కేటాయింపు విషయాన్ని వివరించారు. అలాగే టీటీడీ బోర్డు 20 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు. కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రజల చిరకాల వాంఛ అని, తప్పకుండా నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఇందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని నాయుడుకు వివరించారు. విషయాన్ని పూర్తిగా విన్న నాయుడు దేవస్థానం నిర్మాం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. నిర్మాణం విషయాన్ని ప్రథమ ప్రాధాన్యత కింద తీసుకుటామని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నాయుడు తెలిపినట్లుగా గంగుల తెలిపారు. తమ విజ్ఞప్తిపై చైర్మన్ అత్యంత సానుకూలంగా స్పందించారని తెలిపారు.