12-04-2025 05:15:12 PM
స్వామివారికి వెండి కిరీటాన్ని బహుకరించిన వెంకటేశం..
కొండాపూర్: వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతసాగర్ లోని కోనేటి రాయుడు మందిరంలో రమనీయంగా అశేష భక్తజన సందోహం మధ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. శనివారం కొండాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్ కోనేటి రాయుని మందిరంలో వేద పండితుల మంత్రచారాల మధ్య హనుమాన్ జయంతి ఉత్సవాలను, వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి నూతనంగా దాదాపు కిలో వెండితో చేసిన కిరీటాన్ని బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షుడు తూర్పు వెంకటేశం వెండి కిరీటాన్ని బహుకరించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరచూ స్వామివారి కళ్యాణన్ని తిలకించి పులకించి పోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవిశంకర్, రాజ కీయ నాయకులు ఇంద్రారెడ్డి, ప్రభాకర్, జనార్ధన్ వేమారెడ్డి, భూపాల్ గౌడ్, అనిల్ కుమార్, రఘునాథ్ రెడ్డి, కిరణ్, సంగమేశ్వర్ గౌడ్, హనుమాన్ మాలదారులు దామోదర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.