24-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలో ప్రసిద్ధిగాంచిన సంజీవ ఆంజనేయస్వామి దేవాల యం రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వేంకటేశ్వ ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్య క్ష, కార్యదర్శులు మార్కండేయ, పుండరీకం తెలిపారు. ఈ మేరకు ఆదివారం పద్మశాలి కాలనీలోని ఆంజనేయ స్వా మి దేవాలయంలో ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం స్వామివారికి శతకటాభిషేకం, అర్చన లు, అభిషేకాలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సీనియర్ నాయకుడు బింగి నవీన్ కుమార్, సలహాదారులు ఆర్. ఆంజనేయులు, కృష్ణమూర్తి, కోశాధికారి నవీన్, వినోద్ పాల్గొన్నారు.