05-03-2025 12:06:50 AM
పాల్గొన్న ఎమ్మెల్యే పాయం, జిఎం రామచందర్..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మన ఊరు ఏరియాలోని పివి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దశమ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా భాగంగా మంగళవారం స్వామికి సుప్రభాత సేవ సేవా కాలం శాంతి మంత్రసారంలతో పాటు వివిధ పూజలు నిర్వహింఛారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హోమ పూజ ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏరియా జియం దుర్గం రామచందర్ అధికారులు లక్ష్మీపతి గౌడ్ ఆర్ శ్రీనివాస్ లు పాల్గొని పూజలు నిర్వహించారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి భూదేవిలతో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను అందజేశారు. ఉత్సవాల్లో ఐఎన్ టియుసి ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యులు శేషగిరిరావు, ఆలయ కమిటీ సభ్యులు, ఏరియా అధికారులు, కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు.