calender_icon.png 24 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

13-02-2025 02:07:36 AM

* పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి12 : జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలో సుమా రు మూడు శతాబ్దాల చరిత్ర కలిగి,కొండపైన స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వా మి 25 వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మో త్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణ మహోత్సవాన్ని బుధ వారం ఆశ్లేష నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశమున అంగరంగ వైభవంగా నిర్వహించారు.

జగన్నాథం విష్ణువర్ధనాచా ర్యుల పర్యవేక్షణలో పురోహితులు కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వ హించగా వేలాది మంది భక్తులు పాల్గొన్నా రు. అనంతరం వసంతోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ప్రసాదంగా అన్నదానాన్ని నిర్వ హించారు. అనంతరం ప్రత్యేకంగా అలంక రించిన రథం పైన ఉత్సవమూర్తులను ఉంచి గిరి ప్రదక్షణ నిర్వహించారు.

బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సాం స్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 250 మంది చిన్నారులచే వివిధ దేవతల వేషధారణలతో నిర్వహించిన ఆధ్యాత్మిక కళారూపాల నృత్య ప్రదర్శన భక్తులను ఆక ట్టుకున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

దేవాలయ అభివృద్ధికి నిరంత రం కృషి చేస్తున్న మాజీ జెడ్పిటిసి సభ్యులు మాకునూరి జితేందర్’రావును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పం గంగాధర్, మహేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.