చొప్పదండి, జనవరి 10: రామడుగు సింగిల్ విండో చైర్మన్, టిఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రావు, సంజీవరావు, దావు సుధాకర్, నారాయణ, పూదర్ సురేష్, కట్ల అనిల్, పుల్లెల నవీన్, నార్ల శ్రీకాంత్, మల్లినేని మహేందర్, తదితరులు పాల్గొన్నారు.