09-03-2025 08:32:32 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం గంగారాం పంచాయతీలోని సంపత్ నగర్ గ్రామంలో వెలసిన గిరిజన బాలాజీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవతో ప్రారంభమై యాగశాల, అర్చన చేశారు. అనంతరం పదిన్నర గంటలకు స్వామివారి కల్యాణ మండప ప్రవేశం చేసి మధ్యాహ్నం నిర్ణయించిన ముహూర్తానికి స్వామి వారికి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎన్నారై కొండపల్లి విగ్నేష్, అల్లపల్లికి చెందిన గౌరీశెట్టి నాగభూషణం-భారతమ్మ దంపతులు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొండపల్లి రాజగోపాలకిషన్-రజిత ఆధ్వర్యంలో నిర్వహించగా, లకావత్ రమేష్, ఇస్లావత్ బాలు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు రమేష్, అక్కినపల్లి సోమాచార్యులు, యగ్నికులు శ్రీరంగం అజయ్ సాయి చక్రి, శ్రీరంగం విజయ్ సాయి చక్రిలు వ్యవహరించారు.