calender_icon.png 3 February, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా వెంకటేశ్వర్ గౌడ్...

03-02-2025 06:11:54 PM

మంచిర్యాల (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర శాఖ నూతన జిల్లా అధ్యక్షులను రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్ గౌడ్ 1993 నుంచి బీజేపీలో పని చేస్తున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా గీతా సెల్ కన్వీనర్ గా, జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ గా పని చేశారు.