నేడు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు ఇవ్వనున్న బుర్రా
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ చైర్మన్‌గా ని యమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం బుధవారం వీఆర్‌ఎస్ తీసుకోనున్నారు. తెలంగా ణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో తన వీఆర్‌ఎస్ దరఖాస్తును ప్రభుత్వానికి సమ ర్పిస్తారు. ఇందుకు ప్రభుత్వం ఆమో దం లాంఛనమే కానుంది. ఈనెల 5న ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మంగళవా రం వరకు ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన సేవలందించారు. అ యితే బుర్రా వెంకటేశం స్థానంలో వి ద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభు త్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ లు జోరుగా సాగుతున్నాయి. ఐఏఎస్ అధికారులు శ్రీదేవి, శ్రీధర్, శైలజా రామయ్యర్, శ్రీదేవసేన పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.