మాంచెస్టర్: టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కౌంటీ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో వెంకటేశ్ అయ్యర్ ల్యాంక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ‘కౌంటీలు మన ప్రతిభ ను వెలికి తీస్తాయి. గంగూలీ, లక్ష్మణ్ సహా ఎందరో మాజీలు ఫామ్ కోల్పోయిన ప్రతీసారి కౌంటీ ల్లో రాణించి తిరిగి జట్టుకు ఎంపికయ్యారు. ల్యాంక్‌షైర్ తరఫున ఆడ నుండడం నా అదృష్టం. వన్డే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో స్కిల్‌ను మెరుగుపరుచుకునేందుకు ఇది ఎంతగానో ఉప యోగపడనుంది’ అని తెలిపాడు.