రాజ్కోట్: ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టిన మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ సత్తా చాటాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్లో వెంకటేశ్ అయ్యర్ 17 బంతుల్లోనే 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పటిదార్ (78) అర్ధ సెంచరీతో కదం తొక్కడంతో మధ్య ప్రదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం మధ్య ప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో మేఘాలయ 121 పరుగులకే కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో హర్యానా 175 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
హర్షల్ పటేల్ ఐదు, యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లతో చెలరేగడంతో అరుణాచల్ 80 పరుగులకే పరిమితమైంది. పాండ్యా బ్రదర్స్ బ్యాటుతో పాటు బంతితోనూ చెలరేగడంతో ఉత్తరాఖండ్ మీద బరోడా 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.