బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని మండలంలో గల వెంకటాపూర్ గ్రామం విష జ్వరాలతో విలవిల్లాడుతుంది. గ్రామంలో ఇప్పటికే 60 మందికి పైగా జ్వర పీడితులు మంచం పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం పొందుతున్న జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదని జ్వర పీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.