‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. ఏకంగా 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. పాయల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. “వెంకటలచ్చిమి’ చిత్రం కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపిం చింది.
తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం” అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. “మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను.
నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని చెప్పిన ‘వెంకటలచ్చిమి’ కథ చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బడిశా; నిర్మాతలు: రాజా, ఎన్‌ఎస్ చౌదరి; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని.