24-04-2025 10:19:30 PM
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు...
గజ్వేల్: గజ్వేల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాస చార్యులు వైదిక నిర్వహణలో గోదా లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.