calender_icon.png 4 October, 2024 | 6:59 AM

వాట్సాప్‌లో వెంకన్న దర్శన బుకింగ్

04-10-2024 01:11:11 AM

తిరుమల, అక్టోబర్ 3: తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వచ్చే మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునేలా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఒక్క తిరుమలకే ఈ సౌకర్యాన్ని పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్నీ ప్రసిద్ధ దేవాలయాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఆలయాల్లో ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా నేరుగా దైవదర్శనం చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

తిరుమల లడ్డూపై సుప్రీం విచారణ నేటికి వాయిదా

సుప్రీంకోర్టు వేరే కేసులో బిజీగా ఉన్నందున గురువారం జరగాల్సిన విచారణను వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ కేసు సుప్రీకోర్టు ధర్మాసనం ముందుకు రానుంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేకుంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అని సుప్రీంకోర్టు .. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిం ది. ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.