calender_icon.png 18 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నిర్ణయంపై పునరాలోచ చేయాలి: ప్రభుత్వానికి వెంకయ్య కీలక సూచన

11-04-2025 11:26:37 AM

విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు

సంస్కృతం బోధించడంలో తప్పులేదు.. అమ్మ భాషను దూరం చేయొద్దు

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భావిస్తోందన్న వార్తలు విని విచారించానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) పేర్కొన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నానని తెలిపారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని సూచించారు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందుకే జాతీయ విద్యావిధానం-2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.