calender_icon.png 16 January, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళలపై వెంకయ్య కీలక సూచన

08-07-2024 01:06:46 AM

కళలను విద్యా ప్రణాళికలో భాగం చేయాలన్న మాజీ ఉపరాష్ట్రపతి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి భారతీయ కళలను విద్యాప్రణాళికలో భాగం చేయాలని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నాగ భైరవ ఆరుషి కూచి పూడి నాట్య రంగ ప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “భారతీయ నృత్యాల్లో ప్రావీణ్యం సాధిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, గ్రహణశక్తి పెరుగుతుంది. హావభావాల ప్రకటన సామర్థ్యం పెరిగి ఆత్మవిశ్వాసం ఇనుమ డిస్తుంది. క్రమశిక్షణ, సహనం, సంయమనం, సమన్వయ శక్తి పెరుగుతాయి. అందుకే భారతీయ కళలను విద్యా ప్రణాళికలో భాగం చేయాలి” అని సూచించారు.