calender_icon.png 18 October, 2024 | 2:31 PM

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి...

18-10-2024 12:58:14 PM

కోదాడ (విజయక్రాంతి): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బి.ఎస్ లత అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని బాలాజీనగర్ లో ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద, మండల పరిధిలోని గుడిబండ గ్రామ శివారులో పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టోకెన్ సిస్టం ఏర్పాటు చేయాలని అన్నారు. రైతులు ప్రేమ శాతం చూసుకొని ఆరబెట్టిన అనంతరం తీసుకుని రావాలి అని తెలిపారు. రిజిస్టర్లను మెయింటన్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తాసిల్దార్ రాజధాని, మండల వ్యవసాయ అధికారిని రజిని, వైస్ చైర్మన్ బుడిగం నరేష్, డైరెక్టర్లు గోబ్రా, గుండెపునేని ప్రభాకర్, పార్వతి, కమతం వెంకటయ్య, కౌన్సిలర్లు కైలా స్వామి నాయక్, మాజీ కౌన్సిలర్ వాల్య, ఈర్ల నరసింహారెడ్డి, నవరత్నం రెడ్డి, హసన్ అలీ, వాచీపల్లి వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవి నాయక్, రాజు నాయక్, శ్రీనివాస్ రెడ్డి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.