సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.76 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.