calender_icon.png 15 March, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వేముల జన్మదిన వేడుకలు

15-03-2025 12:00:00 AM

ఏర్గట్ల, మార్చి 14 : మం డల కేంద్రం ఏర్గట్లలో మాజీ మంత్రి,బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను  ఏర్గట్లలోని మండల బి ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ నాయకలు పార్టీ కార్యకర్తలతో  కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఆనంతరం స్వీట్లు పంచి వేములకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సం దర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజపూర్ణ నందం, మాజీ ఏంపిపి కొలిప్యాక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన పాత్ర వహించి అన్ని గ్రామాలకు సమాన రీతిలో అభివృద్ధి నిధులను పంచారని బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రశాంత్ రెడ్డి కి ఉంటాయని, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్, సొసైటీ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, వైస్ చైర్మన్ సింగసరం గంగారాం, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు నర్సయ్య, జైనోద్ధిన్,బద్దం ప్రభకార్, బద్దం హన్మాండ్లు,  సుభాష్ రెడ్డి, కూతురు చిన్న సాయన్న, లక్కం నర్సయ్య, రాదారపు సహదేవ్, ఇమామ్, నాగిరెడ్డి రాజేందర్ రెడ్డి, అట్లా పోషన్న, ప్రవీణ్ యాదవ్, సురేష్, కొలిప్యాక శ్రీనివాస్ రెడ్డి, కట్కామ్ సాగర్ రెడ్డి, గడ్డం రమేష్, బద్దం శ్యామ్ రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.