calender_icon.png 25 October, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పాలనలో డిజైన్లు అంతా లోపభూయిష్టమే..

09-08-2024 04:47:23 PM

పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయ్.. 

ఇందుకు నిదర్శనమే సుంకిశాల వాల్ కూలడం 

వేలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు 

కరింనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల డిజైన్లు అంతా లోపభూయిష్టంగా చేపట్టారని, వేలాది రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడ్డింది.

బీఆర్ఎస్ హయంలో చేపట్టిన నాసిరకం పనులే కారణమని సుంకిశాల తాగునీటి వాల్ కూలిందని ఆయన మండిపడ్డారు. వారి హాయంలో కట్టిందే కూలిందని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు బధ్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సుంకిశాల వాల్ కూలిపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కాంగ్రెస్ సర్కార్ పై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో ఎవరేం చేశారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో  ఇష్టారాజ్యంగా డిజైన్లు, నాసిరకం పనుల వల్ల చేపట్టిన ప్రాజెక్టులు పనికి రాకుండా తయారయ్యాయి. వేలాది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రాజెక్టులు, పథకాలు 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించలేదని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇన్నాళ్లు కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అనుకున్నామని, గత బీఆర్ఎస్ పాలకులు కట్టినవన్నీ అద్వానమేనని ప్రస్తుతం తెలుస్తున్నదని తెలిపారు.