calender_icon.png 28 October, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌కు ఒక్క ప్రాజెక్టు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్

24-07-2024 12:36:32 PM

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ 

పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు 

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ఏపీ బీహార్ కు వరదలాగా నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి బురద చూపారని కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యం అన్నారు.   

తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినా ఒక్క ప్రాజెక్టుకు కేటాయింపులు జరపలేదని విమర్శించారు. కరీంనగర్ రైల్వే లైన్ కు సంబంధించి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం శోచనీయం. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విషయంలో పట్టింపు లేని తనంతో వ్యవహరించినట్లు స్పష్టం అవుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో 8 స్థానాలను బీజేపీ జాతీయ పార్టీని గెలిపిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు .


.