calender_icon.png 21 November, 2024 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగిలించిన డబ్బులు రికవరీ చేసిన వెల్దుర్తి పోలీసులు

11-11-2024 11:13:18 AM

వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణనికి చెందిన జీతయ్య గారి లక్ష్మణ్ అతని భార్య కలిసి ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లారు, తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం, లోపల ఇంటిలో గల బీరువా తాళం పగులగొట్టి  దానిలోని 25,000 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు అని లక్ష్మణ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెల్దుర్తి ఎస్సై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సైకి అనుమానం వచ్చి లక్ష్మణ్ ఇంటి పక్కన గల అనుమానితుడు విజయ్ కుమార్ ని విచారించగా, అట్టి వ్యక్తి నేరాన్ని అంగీకరించగా దొంగిలించిన డబ్బులను రికవరీ చేసి, చట్ట ప్రకారం విజయ్ కుమార్ నేడు రిమాండ్ కు తరలించడం జరిగింది.