calender_icon.png 23 September, 2024 | 6:58 AM

దేశానికే దిక్సూచి తెలంగాణ బడ్జెట్

25-07-2024 03:32:31 PM

 రాష్ట్ర అభివృద్దే సర్కారు లక్ష్యం 

 వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం 

 రైతు పక్షపాతిగా  నిరూపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు

 కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు 

కరీంనగర్: రెండు లక్షల 91,159 కోట్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జనరంజకమైన బడ్జెట్ ను రూపొందించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని తెలిపారు. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజేందర్ రావు దీనిపై  స్పందించారు.

రైతును రాజు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. బడ్జెట్లో సింహ భాగం వ్యవసాయ రంగానికి కేటాయించడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు కేటాయించడం రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్నదని చెప్పారు. అదేవిధంగా గృహ జ్యోతి పథకానికి 2418 కోట్లు కేటాయించారని తెలిపారు. గతంలో అప్పుల కుప్పగా మార్చిన బీ ఆర్ఎస్ సర్కార్ వైఖరి వల్ల ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 42, 892 ఓట్లు అప్పులకు వడ్డీ కింద చెల్లించడం ఓట్లు అప్పులకు వడ్డీ కింద చెల్లించిందని చెప్పారు. 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఆరు లక్షల 71 వేల అప్పులు గత పాలకులు చేశారని తెలిపారు.

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29 816 కోట్లు, హైదరాబాద్ సిటీ అభివృద్ధికి పదివేల కోట్లు, బీసీ సంక్షేమానికి 9200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3003 కోట్లు, గ్యాస్ సబ్సిడీ స్కీంకు ₹723 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం అభినందనీయమని రాజేందర్ రావు పేర్కొన్నారు.  కాంగ్రెస్ సర్కారు పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. దేశానికే బడ్జెట్ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇందు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులకు రాజేందర్ రావ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.