11-02-2025 11:24:36 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ట్రాఫిక్ ఎస్.ఐ దేవేందర్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని 25 వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. నంబర్ ప్లేట్లు బిగించి, పెండింగ్ చలాన్ లు చెల్లించిన తర్వాత వాహనాలు తిరిగి వాహనదారులకు అందజేస్తామని ఎస్‌ఐ తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను ఆర్టీవో కార్యాలయానికి పంపిస్తామని వెల్లడించారు.