సూర్యాపేట టౌన్, జనవరి 30 : నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగం గా గురువారం పట్టణంలోని కోర్టు చౌరస్తా వద్ద వాహన చోదకులకు అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనాలకు స్టిక్కర్స్ వేయడం, నెంబర్ ప్లేట్లను వంచ డం, పరిమితికి మించి ప్రయాణించడం వంటివి చట్టరీత్యా నేరమన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్నారు. సరైన నెంబర్ ప్లేట్ లేని 24 ద్విచక్ర వాహనలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.