24-02-2025 01:03:18 AM
వికారాబాద్, ఫిబ్రవరి 23: అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు మూడు టిప్పర్లు రెండు జెసిబిలను సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సు ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. మోమిన్ పెట్ నవపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న ట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
మోమిన్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరంపల్లి గ్రామ శివారులో, నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కతల గ్రామ శివారులో ఎర్ర మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకొని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.