కామారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టగా డ్రంకెన్ డ్రైవ్ చే స్తూ పట్టుబడ్డ 110 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. 66 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 60 కేసులు, ఎల్లారెడ్డి పోలీస్ సబ్ డివిజ న్ పరిధిలో 28, బాన్సువాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 22 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.