06-03-2025 11:20:02 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న వాహనాన్ని గురువారం కల్వరి చర్చి సమీపంలో అటవీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వాహనంతో పాటు అందులో ఉన్న 16 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో కలప తరలిస్తున్న వ్యక్తులు అటవీ అధికారులను చూసి వాహనం ఆపివేసి పరారయ్యారు. విచారణ కోసం కలపతో ఉన్న వాహనాన్ని బెల్లంపల్లి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కలప తరలిస్తున్న వాక్కులను పట్టుకున్న వారిలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌరీ శంకర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, డ్రైవర్ మల్లిఖార్జున్ లు ఉన్నారు.